బెంగాల్ మంత్రుల ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి

కోల్‌కతా: బెంగాల్లో గవర్నర్ జగదీప్ ధంకర్‌కు, సీఎం మమత బెనర్జీకి మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతూనే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మమత ఘనవిజయం సాధించి పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే నారద టేపుల కేసులో ఇదివరకటి మమత ప్రభుత్వంలోని నలుగురిపై సీబీఐ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి జారీ చేయడంపై వివాదం రగులుకుంటున్నది. అందులో ఇద్దరు (సుబ్రత ముఖర్జీ, ఫిర్హాద్ హకీం) సోమవారం నాటి విస్తరణలో మంత్రి పదవులు పొందడం గమనార్హం. గవర్నర్ అనుమతి ఇవ్వడం, అదీ ఈ సమయంలో ఇవ్వడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమంటే సువేందు అధికారి ప్రాసిక్యూషన్‌పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడి చేయకపోవడం. నారద టేపుల కుంభకోణం జరిగిన సమయంలో తృణమూల్ ఎంపీగా ఉన్న సువేందు ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి మంజూరు చేసిన మరో ఇద్దరు మాజీ మంత్రుల్లో మదన్ మిత్రాకు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. మరో మంత్రి సోవన్ చటర్జీ తృణమూల్ నుంచి 2019 ఆగస్టులో బీజేపీలోకి మారిపోయారు. తర్వాత అందులో నుంచి కూడా బయటకు వచ్చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. గవర్నర్ ్నుమతి కథలో ఇంకో ట్విస్టు కూడా ఉంది. లోక్‌సభ సభ్యుల ప్రాసిక్యూషన్‌కు స్పీకర్ అనుమతి తప్పనిసరి. అలాగే ఎమ్మెల్యేల ప్రాసిక్యూషన్ కు అసెంబ్లీ స్పీకర్ అనుమతి కావాలి. కానీ ఎందువల్లనో సీబీఐ ఆ మార్గంలో వెళ్లకుండా మంత్రుల ప్రాసిక్యూషన్ అంటూ గవర్నర్ దగ్గరకు వెళ్లింది. ఆరుగురు ఎంపీలు, నలుగురు మంత్రులు లంచం తీసుకోవడం నారద టేపుల్లో రికార్డు అయింది. అందులో ఒకరు చనిపోయారు. కొందరు పార్టీలు మారారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేదల గుడిసెలపై బుల్డోజర్లు
అగ్రి వర్సిటీలో ఆందోళన
Jayannth & The Jingo Pen | బాలల దినోత్సవం రోజున ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ. 150కే సినిమా టికెట్
Guppedantha Prema | డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘పారడాక్స్ హరికథ’.. ఘనంగా ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

