వేసవిలో విరివిగా దొరికే పండ్లలో పనస పండు(జాక్ ఫ్రూట్) ఒకటి. భారీ పరిమాణంతో ఉండే పండు చూడ్డానికి వింతగా కనిపించినా.. అందులోని పనస తొనలు నోరూరిస్తాయి. ఈ తొనలు కేవలం రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. అందుకే పనసపండును ఆయుర్వేదంలో ఔషధ గని అని పిలుస్తారు. అన్ని ఔషధ గుణాలు కలిగిన పనస పండును తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటే చూద్దాం..
పనసపండు తినడం వల్ల శరీరానికి అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. పనసలో ఫైబర్, విటమిన్- సి, విటమిన్- ఎ, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, భాస్వరం, కాల్షియం కూడా ఉంటాయి. ఇది బీటా కెరోటిన్, లుటిన్, మరియు జియాక్సంతిన్లతో సహా గణనీయమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంది. అయితే వీటిన్నింటికన్నా ఎక్కువ .. ఈ పసనపండు ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో గణనీయమైన మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది.