ఏప్రిల్లో బ్యాంకులకు సెలవులే సెలవులు!

న్యూఢిల్లీ: వచ్చేనెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు 14 రోజులు మూతపడే ఉంటాయి. ఈ సంగతిని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) హాలీడే క్యాలెండర్ పేర్కొంది. ఇందులో ఎనిమిది రోజులు వివిధ పండుగల సెలవులు కాగా, ఏప్రిల్ ఒకటో తేదీ బ్యాంక్ క్లోజింగ్ డే, నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు, నిత్యం వచ్చే సెలవులే. ఇక మార్చి 27-29 మధ్య నాలుగో శనివారం, ఆదివారం, హోలీ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు. ఈ నెల 31వ తేదీన బ్యాంకులు తిరిగి పని చేస్తున్నాయి. కానీ ఆ రోజు కస్టమర్లకు సాధారణ సేవలు ఉండబోవు. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపు కావడమే దీనికి కారణం.
ఏప్రిల్లో బ్యాంకు సెలవులిలా..
ఏప్రిల్ 1న వార్షిక ఖాతాల ముగింపు, 2న గుడ్ ఫ్రైడే, 4న ఆదివారం, 5న బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, 10న రెండో శనివారం, 11న ఆదివారం, 13న గుడి పడ్వా/తెలుగు సంవత్సరాది/ఉగాది, 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి /తమిళ సంవత్సరాది, 15న హిమాచల్ డే/బెంగాల్ సంవత్సరాది, 16న బొహాగ్ బిహు (అసోం అంతటా సెలవు), 18న ఆదివారం, 21న శ్రీరామ నవమి, 24న నాల్గవ శనివారం, 25న ఆదివారం. అయితే, బ్యాంకులకు అధికారిక సెలవులు ఉన్న రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో పని దినాలుగా ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

