నా మాటే శాసనం

‘ఒక మాట నువ్వంటే అది శబ్దం. అదే మాట నేనంటే శాసనం. దైవ శాసనం అని చెబుతున్న అఖండ కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అన్నారు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ట్రైలర్‌ను ఆదివారం చిత్రబృందం విడుదలచేసింది. ఈ ట్రైలర్లో బాలకృష్ణ అఘోరాగా, సాధారణ వ్యక్తిగా రెండు భిన్న పార్శాల్లో కనిపిస్తున్నారు. ‘విధికి, విధాతకు, విశ్వానికి సవాళ్లు విసరకూడదు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది. ‘మేమేంటో అంచనా లేకుండా హామీలిస్తున్నావు’ అని ప్రతినాయకుడు విసిరిన సవాల్‌కు ‘అంచనా వేయడానికి నువ్వేమైన పోలవారం డ్యామా..పట్ట్టిసీమ తూమా. పిల్లకాలువ’, ‘ఒక్క సారి డిసైడ్ అయ్యి బరిలో దిగితే.. బ్రేకులు లేని బుల్డోజర్ను. తొక్కి పారేస్తా’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌లతో ట్రైలర్ శక్తివంతంగా సాగింది. ఆయనపై తెరకెక్కించిన పోరాట ఘట్టాలు రొమాంచితంగా అనిపించాయి. ఈ సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు. ప్రగ్యాజైస్వాల్ కథానాయిక. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. డిసెంబర్ 2న సినిమాను విడుదలచేయబోతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

