Bael Tree | మారేడు చెట్టు కింద ఆ పనిచేస్తే నిరుపేద కూడా సంపన్నుడు అవుతాడట తెలుసా..!
Bael Tree | హిందూధర్మంలో చెట్టును దైవంగా పూజిస్తారు. కొన్ని వృక్షాలు దేవతా వృక్షాలుగా కీర్తింపబడుతాయి. ఇలా దేవతా వృక్షాలుగా కీర్తింపబడే వాటిలో మారేడు చెట్టు (Bael Tree) కు ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. మారేడు చెట్టుని సంస్కృతంలో బిల్వ వృక్షం అని అంటారు. బిల్వ వృక్షం శివునికి అత్యంత ప్రీతికరమైనది.
Bael Tree : హిందూధర్మంలో చెట్టును దైవంగా పూజిస్తారు. కొన్ని వృక్షాలు దేవతా వృక్షాలుగా కీర్తింపబడుతాయి. ఇలా దేవతా వృక్షాలుగా కీర్తింపబడే వాటిలో మారేడు చెట్టు (Bael Tree) కు ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. మారేడు చెట్టుని సంస్కృతంలో బిల్వ వృక్షం అని అంటారు. బిల్వ వృక్షం శివునికి అత్యంత ప్రీతికరమైనది. అందుకే మారేడు దళాలతో శివయ్య (Lord Shiva) ను పూజిస్తారు. బిల్వ పత్రంలోని మూడు ఆకులు శివుని మూడు కళ్ళకు ప్రతీకగా చెబుతారు.
లక్ష్మీదేవి తన కుడి చేతితో మారేడు చెట్టును సృష్టిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మారేడు వృక్షాన్ని శ్రీ వృక్షమని, మారేడు కాయలు శ్రీఫలాలని అంటారు. మారేడు చెట్టు ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుందనేది చాలమంది విశ్వాసం. మన పురాణాల్లో చెప్పబడ్డ ఐదు లక్ష్మీ స్థానాల్లో మారేడు దళం కూడా ఒకటి. పువ్వులు పూయకుండానే కాయలు కాయడం మారేడు విశిష్టతగా చెప్పవచ్చు. అందుకే దీన్ని వనస్పతి అని కూడా పిలుస్తారు.
ముళ్ల చెట్లను ఇంట్లో పెంచుకుంటే శత్రు బాధలు ఎక్కువవుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. కానీ ఈ దేవతా వృక్షానికి అటువంటి పట్టింపు ఏమీలేదు. ఇంటి ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో తూర్పు, దక్షిణ దిక్కుల్లో మారేడు చెట్టును పెంచుకోవచ్చు. అంతేకాదు ఈ చెట్టు కింద ఓ పరిహారం చేస్తే కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడట. ఇంట్లో లక్ష్మీదేవి తిరగాడుతుందట. పట్టిందల్లా బంగారమే అవుతుందట.
ఇంతకూ ఆ పరిహారం ఏమిటంటే.. చెట్టు మొదట్లో శుభ్రంచేసి మొదలుకు పసుపు అలంకరించి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలట. ఇలా చేస్తే కోటి మంది దేవతలకు ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం లభిస్తుందట. అదేవిధంగా ఆ చెట్టు కింద పీటవేసి ఒక యోగ్యుడికి భోజనం పెడితే కోటి మంది దేవతలకు పూజ చేసిన పుణ్యం దక్కుతుందట. ఇలా మారేడు వృక్షాన్ని పూజించే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. దాంతో కటిక పేదవాడు కూడా క్రమంగా సంపన్నుడిగా మారిపోతాడట.
కాగా, మారేడు దళాలతో శివునికి పూజ చేసేటప్పుడు ఈనెలను తీయాల్సిన అవసరం లేదు. ఈనెలను పట్టుకుని శివార్చన చేస్తారు. అయితే మారేడు దళాలను ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదట. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయట. బుధ, శనివారాల్లో మాత్రమే మారేడు పత్రాలను కోయాలట. చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ, అష్టమి తిథుల్లో కూడా బిల్వాలను కోయకూడదట. సంధ్యా సమయం, రాత్రి వేళళ్లో, శివరాత్రి రోజున కూడా మారేడు పత్రాలను కోయవద్దని చెబుతారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bael Tree | మారేడు చెట్టు కింద ఆ పనిచేస్తే నిరుపేద కూడా సంపన్నుడు అవుతాడట తెలుసా..!
AP News | ఉత్తరాంధ్రకు మళ్లీ తుపాను ముప్పు.. 18, 19 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్..!
Master Bharat | నటనకు దూరమవుతున్నాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన మాస్టర్ భరత్
RS Praveen Kumar | కాంగ్రెస్ పార్టీకి నాలుగో అనుబంధ సంస్థ తెలంగాణ రక్షణ సేన : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Actor Giribabu | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

