జడపిన్నులు మరింత నాజూకుగా మారాయి. డిజైనర్ కళను సంతరించుకున్నాయి. జట్టు రేగిపోకుండా కాపాడటం ఒక్కటే వాటి పని కాదు. ఎదుటివాళ్లు కళ్లు తిప్పుకోకుండా చూడటం కూడా తమ బాధ్యతేనని భావిస్తున్నాయి.. నవతరం హెయిర్ బాబీలు! తయారీ సంస్థలు వెండి మెరుపులతో మగువలను ఊరిస్తున్నాయి. భవ్య రమేశ్ అనే జువెలరీ డిజైనర్ రూపకల్పన ఇది. డిజైనర్ పేరుతోనే ఓ వెబ్సైట్ ఉంది. అందులో ఆర్డర్ చేసుకోవచ్చు. రెండు వేల నుంచీ ధరలు మొదలవుతాయి.