ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న మాజీ కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో!
Babul Supriyo | మాజీ కేంద్రమంత్రి బాబుల్ సూప్రియో ఈ నెల 19న రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాకు అసన్సోల్ ఎంపీ పదవికి రాజీనామా

కోల్కతా : మాజీ కేంద్రమంత్రి బాబుల్ సూప్రియో ఈ నెల 19న రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాకు అసన్సోల్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని, ఈ మేరకు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు రాజీనామాపై ఎంపీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. బీజేపీ నుంచి అసన్సోల్ ఎంపీగా గెలిచిన ఆయన.. కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఆ తర్వాత జరిగిన కేంద్రమంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవిని కోల్పోయారు. దీంతో మనస్థాపానికి గురైన ఆయన.. ఆ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మనసు మార్చుకొని అధికార టీఎంసీలో చేరారు. ఈ క్రమంలో బీజేపీ నుంచి గెలుపొంది.. టీఎంసీలో కొనసాగడం అనైతికంగా భావిస్తూ.. ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. బాబుల్ సుప్రియో అసన్సోల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు 2014, 2019లో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

