మన బిడ్డల భద్రత కోసం.!
- గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్‌పై అవగాహన తప్పనిసరి
- తల్లిదండ్రులు సూచనలివ్వాలి: పోలీసులు
- 90 శాతం కేసుల్లో నిందితులు తెలిసినవాళ్లే
- పరిచయస్థులే పిల్లలను చిదిమేస్తున్నారు

బాగా తెలిసినోడే.. మన బంధువే.. వరుసకు అన్నయ్య అవుతాడు.. సొంత మామయ్యే.. అని చెప్పి పిల్లలను వాళ్లకు అప్పగిస్తున్నారా? తల్లిదండ్రులూ.. ఒక్క నిమిషం! ఎదుటి వ్యక్తిలో ఎంతటి కామం దాగుందో? ఎంతటి క్రూరత్వం ఉన్నదో? చిన్నారులను చిదిమేసే ఏ ఆలోచన చేస్తున్నారో? మీరు జాగ్రత్తగా ఉంటేనే పిల్లలు సేఫ్. వాళ్ల భవిష్యత్తూ సేఫ్.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): అమ్మాయి, అబ్బాయి అన్న తేడా లేకుండా కామాంధులు చిన్నపిల్లలపై నీచానికి ఒడిగడుతున్న సంఘటనలు కోకొల్లలు. చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల్లో నిందితులు 90శాతం వరకు వారికి తెలిసినవారేనని గణాంకాలు చెప్తున్నాయి. వరుసకు బాబాయే, అన్నయ్యే, మామయ్యే, అత్యంత సన్నిహితుడే అని అనుకోవటం పొరపాటేనని స్పష్టం చేస్తున్నాయి. ఎదుటి వ్యక్తి స్వభావాన్ని మనం గుర్తించలేనపుడు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అన్న విషయాలు పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలని పోలీసులు సూచిస్తున్నారు. తాకకూడని శరీర భాగాలను ఎవరైనా తడిమితే భయపడకుండా ‘డోంట్ టచ్ మీ’అని గట్టిగా అరిచేలా పిల్లలకు చెప్పాలని సూచిస్తున్నారు.
తల్లిదండ్రులూ.. ఇవి గమనించండి
- ఎట్టిపరిస్థితుల్లోనూ అపరిచితుల ఇంటికి పిల్లలను పంపవద్దు.
- పక్కింటివారే కదా అని వదిలేయకుండా, గమనిస్తూ ఉండాలి.
- ఎవరింటికైనా పిల్లలు వెళ్లి వస్తే ఆ ఇంట్లో కుటుంబసభ్యులు ఎలా ప్రవర్తించారో చిన్నారులను ఆరా తీయాలి.
- పట్టణ ప్రాంతాల్లో అద్దెకు ఉండేవారైతే మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలను ముద్దు చేస్తున్నారు కదా అని ఇరుగుపొరుగువారిని నమ్మవద్దు.
- చిన్నారులకు తప్పకుండా తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు నోటికి నేర్పాలి, డయల్ 100 నంబర్ గురించి అవగాహన కల్పించాలి.
పిల్లలను ఒంటరిగా వదలొద్దు
ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలను ఒంటరిగా వదలటం ప్రమాదకరం. వారు బయటికి వెళ్లినా, తెలిసిన వారితో ఉన్నా తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చినా పిల్లలను వెంట తీసుకెళ్లటం మంచిది. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే గట్టిగా అరవటం, ఇంట్లో వచ్చి చెప్పేలా పిల్లలకు అవగాహన కల్పించాలి. చుట్టుపక్కలవారు ఎలా ప్రవర్తిస్తున్నారో పిల్లలను అడుగుతూ, గమనిస్తూ ఉండాలి.
- డాక్టర్ చెన్నోజు వీరేందర్, సైకాలజిస్ట్
తెలిసిన వారే తప్పు చేస్తున్నారు
ఎవరు :ఎంత శాతం
స్నేహితులు, చుట్టుపక్కలవారు: 29.66
కుటుంబసభ్యులు :13.81
ఆన్లైన్ ద్వారా పరిచయస్తులు :56.27
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

