Avengers: Doomsday | హాలీవుడ్ సినిమా అవెంజర్స్: డూమ్స్‌డే డిసెంబర్లో విడుదల కానున్నది. కానీ దీనికి సంబంధించిన ఓ వార్త గ్లోబల్‌గా హాట్ టాపిక్‌గా నిలిచింది. అదేమంటే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ను జూలై 20 నుంచి ప్రారంభించారు. ఈ అడ్వాన్స్ బుకింగ్ కేవలం 12 గంటల్లో 10 మిలియన్ డాలర్లు (రూ. 100 కోట్లు) వసూలు చేసి రికార్డు సృష్టించింది. మార్వెల్ స్టూడియో నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ కూడా సోమవారమే రిలీజ్ అయ్యింది.
డిస్నీ సంస్థ కొత్తగా ప్రారంభించిన లార్జ్ స్క్రీన్ ఫార్మాట్ ఇన్ఫినిటీ విజన్ (Infinity Vision)లో మాత్రమే ఈ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. అమెరికా వ్యాప్తంగా 10 శాతం థియేటర్లలో ఈ ఫార్మాట్‌ను ఏర్పాటు చేశారు. ఐమ్యాక్స్ స్క్రీన్లకు పోటీగా డిస్నీ ప్రారంభించిన ఈ ప్రత్యేక ఫార్మాట్ సినీ అభిమానులకు బాగా నచ్చింది.
ఈ సినిమాకు మరో ప్రత్యేక ఏమిటంటే జూనియర్ రాబర్ట్ డౌనీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దీనిలో డాక్టర్ డూమ్స్ పాత్ర పోషిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో క్రిస్ ఎవాన్స్, క్రిస్ హెమ్స్‌వర్త్, పెడ్రో పాస్కల్, ఆంటోని మ్యాకీ, పాల్ రడ్ వంటి సూపర్ స్టార్లు నటిస్తున్నారు.
అదేవిధంగా అవెంజర్స్: ఇన్ఫినిటీవార్, అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రాలను డైరెక్ట్ చేసిన రూసో బ్రదర్స్ ఆంథోని, జో మళ్లీ ఎంట్రీ ఇస్తున్నారు.
ఇప్పటివరకు మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటున్న మార్వెల్ స్టూడియో ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తుంది. ఈ సంస్థ నిర్మించిన డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్, గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ-3, స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ సినిమాలు ఆశించినంతగా విజయం సాధిచంలేదు.
అయితే ఈ సినిమా డిసెంబర్ 18న విడుదల కానుండగా, అదే నెలలో డ్యూన్-3 విడుదలవుతుంది. ఏ సినిమా హిట్‌గా నిలుస్తుందో వేచి చూడాలి.