నరేష్ అగస్త్య, సంగీర్తన విపిన్, ఆర్యన్ రాజేష్, అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అసురగణ రుద్ర’. మురళీ శర్మ, ఆమని, శత్రు, అమిత్, దేవీ ప్రసాద్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మురళీ కాట్రగడ్డ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కమ్జుల ప్రొడక్షన్స్ సంస్థలో మురళీ వంశీ నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మురళీ కాట్రగడ్డ మాట్లాడుతూ…‘మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అభినయ పాత్ర కీలకంగా ఉంటుంది. ఈ నెల 6వ తేదీ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు. ‘మా సంస్థలో నిర్మిస్తున్న తొలి చిత్రమిది. యాక్షన్ సీక్వెన్స్‌తో చిత్రీకరణ మొదలుపెడుతున్నాం. ఈ చిత్రం పూర్తయిన వెంటనే మరో సినిమాను ఇదే బృందంతో ప్రారంభిస్తాం’ అని నిర్మాత మురళీ వంశీ అన్నారు.