ఆస్టర్ డీఎం మరో హాస్పిటల్
ప్రముఖ ఆసుపత్రుల నిర్వహణ సంస్థ ఆస్టర్ డీఎం క్వాల్టీ..హైదరాబాద్‌లో మరో కొత్త హాస్పిటల్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది.
- రూ.500 కోట్లతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న సంస్థ
హైదరాబాద్, నవంబర్ 14: ప్రముఖ ఆసుపత్రుల నిర్వహణ సంస్థ ఆస్టర్ డీఎం క్వాల్టీ..హైదరాబాద్‌లో మరో కొత్త హాస్పిటల్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో రూ.500 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న 300 పడకల మల్టీస్పెషాలిటీ ఆస్టర్ ఆస్పత్రి 2027 మార్చిలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే, హైదరాబాద్‌లో గ్రూప్ పడకల సామర్థ్యం 1,700 దాటనున్నది. ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఈ కొత్త హాస్పిటల్‌ను ప్రకటించారు.
రెండేండ్లలో 4 వేల కోట్ల పెట్టుబడులు
దేశవ్యాప్తంగా మరిన్ని ఆసుపత్రులను ఏర్పాటు చేయడానికి వచ్చే రెండేండ్లకాలంలో రూ.4 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. దీంతో మొత్తం పడకల సంఖ్య 15 వేలకు చేరుకోనున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 28 నగరాల్లో 39 హాస్పిటల్స్‌లో 10,600 పడకలను నిర్వహిస్తున్నది. ప్రధానంగా దక్షిణాదితోపాటు మధ్య భారతంలో ఉన్న పాత హాస్పిటల్స్‌ను కొనుగోలు చేయడంతోపాటు కొత్తవి ఏర్పాటు చేసే ఆలోచనలో సంస్థ ఉన్నదన్నారు. దీంట్లోభాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు మాకు ముఖ్యమైన మార్కెట్లు. ఈ ప్రాంతంలో మా ఉనికిని మరింత విస్తరించేందుకు గణనీయమైన అవకాశాలున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

