Home
Telangana
Tenant Farmer In Nirmal Loses Four Acres Of Paddy Crop Due To Irrigation Water Shortage
కౌలురైతు కంటతడి!
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన రైతుకు సాగునీటి కొరత కన్నీళ్లు మిగిల్చింది. నిర్మల్ జిల్లా పెంబికి చెందిన బోదాసు రాజు పెంబితండాలో భీమన్న చెరువు ఆయకట్టు కింద నాలుగెకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు.
- సాగునీరు లేక ఎండిన వరి
- ఎండిన పంటను మేస్తున్న పశువులు
పెంబి, నవంబర్ 14 : ఆరుగాలం కష్టపడి సాగు చేసిన రైతుకు సాగునీటి కొరత కన్నీళ్లు మిగిల్చింది. నిర్మల్ జిల్లా పెంబికి చెందిన బోదాసు రాజు పెంబితండాలో భీమన్న చెరువు ఆయకట్టు కింద నాలుగెకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. సరైన సమయంలో యూరియా అందక, పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు అందక వరి పైరు పూర్తిగా ఎండిపోయింది. పచ్చగా కళకళలాడాల్సిన వరి పైరు సాగునీరు అందక ఎండిపోవడంతో పశువులకు మేతగా చేశాడు.
భూమిని కౌలుకు తీసుకొని రూ.లక్ష పెట్టుబడి పెట్టి సాగు చేశానని, సాగు నీరు అందక చేతికొచ్చిన పంట ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయాయనని రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. భీమన్న చెరువుకు సరస్వతి కాలువ డీ-28 ద్వారా సరైన సమయంలో సాగు నీరు రాకపోవడంతోనే చెరువులో నీరులేక పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పంట నష్టపోయిన తనకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

