SPEAKERS MEET: రేపు ఆలిండియా అసెంబ్లీ స్పీకర్ల సదస్సు
1921 సెప్టెంబర్ 15న సిమ్లాలో జరిగిన మొదటి ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ జరిగి వందేండ్లు పూర్తి చేసుకున్నది.

హైదరాబాద్: 1921 సెప్టెంబర్ 15న సిమ్లాలో జరిగిన మొదటి ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ జరిగి వందేండ్లు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా రేపు (బుధవారం) 81వ ఆలిండియా అసెంబ్లీ స్పీకర్లు అండ్ కౌన్సిల్ చైర్మన్ల సమావేశం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి.నరసింహా చార్యులు తెలిపారు. వర్చువల్ విధానంలో జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్ లో లోక్ సభ స్పీకర్ అధ్యక్ష హోదాలో పాల్గొంటారని చెప్పారు.
అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, దేశంలోని 28 రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ స్పీకర్లు, 6 రాష్ట్రాల లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్లు ఆయా రాష్ట్రాల నుంచి ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారని అన్నారు. ఈ సందర్భంగా రేపటి నుంచి రాజ్యసభ, లోక్ సభ TV లను కలిపి ‘సంసద్’ TV గా మార్చి ప్రసారాలను ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ప్రొటెం చైర్మన్ శ్రీ వి.భూపాల్ రెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ శాసనసభ భవనంలో ఏర్పాటు చేసిన వర్చువల్ విదానం ద్వారా కాన్ఫరెన్స్ లో పాల్గొంటారని వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

