Ashwagandha | అశ్వగంధ మహిళలు తీసుకొవచ్చా? ఆరోగ్యానికి మంచిదేనా?
Ashwagandha | పేరులేని వ్యాధికి ‘పెన్నేరుదుంప’ అని నానుడి. పెన్నేరుదుంపనే ఆయుర్వేదంలో అశ్వగంధ అని పిలుస్తారు. ఇది బహుళ ప్రయోజనకారి. కరోనా తర్వాత వాడకం పెరిగింది. రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేయడం అశ్వగంధ ప్రత్యేకత.
Ashwagandha Health Benefits | మేడమ్ నమస్తే. అశ్వగంధ ఆరోగ్యానికి మేలు చేస్తుందని చదివాను. కానీ నాకో సందేహం. దీన్ని మహిళలూ తీసుకోవచ్చా?
– ఓ పాఠకురాలు
పేరులేని వ్యాధికి ‘పెన్నేరుదుంప’ అని నానుడి. పెన్నేరుదుంపనే ఆయుర్వేదంలో అశ్వగంధ అని పిలుస్తారు. ఇది బహుళ ప్రయోజనకారి. కరోనా తర్వాత వాడకం పెరిగింది. రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేయడం అశ్వగంధ ప్రత్యేకత. కానీ, చాలామంది అశ్వగంధను మగవారికే పరిమితమైన ఔషధమని భావిస్తారు. నిజానికి స్త్రీలు, చిన్నపిల్లలకు కూడా ఎంతో మంచి చేస్తుంది. ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన, కుంగుబాటు తదితర దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. కండరాలకు బలాన్నిస్తుంది. క్రీడా
కారులు, నృత్యకారులను త్వరగా అలసిపోనివ్వదు.
వృద్ధాప్య రుగ్మతలకు మంచి ఉపశమనం. దీర్ఘాయువును, పటుత్వాన్ని ఇస్తుంది. నరాల బలహీనతను నియంత్రిస్తుంది. ప్రత్యేకించి మెనోపాజ్ సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. రుతుక్రమానికి ముందు ఇబ్బందిపెట్టే చికాకులను, మూడ్ స్వింగ్స్‌ను అడ్డుకుంటుంది. ఒత్తిడి కారణంగా వచ్చే ఊబకాయాన్ని దూరం చేస్తుంది. కానీ గర్భిణులు, పాలిచ్చే తల్లులు వాడకపోవడమే మంచిది. థైరాయిడ్, బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యుడిని సంప్రదించాకే ఉపయోగించాలి.
ఇన్ని ఉపయోగాలా!
వయసు మీద పడుతున్నకొద్దీ ముఖం మీద ముడతలు, చారలు సహజం. వీటిని నివారించడానికి విటమిన్-ఇ ఆయిల్ సాయపడుతుంది. ఈ నూనెను నేరుగా ముఖానికి పూసుకోవచ్చు. క్యాప్సుల్స్ రూపంలోనూ తీసుకోవచ్చు. చర్మ సంరక్షణలో విటమిన్-ఇ పాత్ర కీలకం..
- ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
విటమిన్-ఇ ఆయిల్‌ను కండ్ల చుట్టూ మర్దన చేసుకుంటే నల్లచారలు మాయమైపోతాయి. - ఈ నూనె ఒంటిని తేమగా ఉంచుతుంది. ఫలితంగా, చర్మం కాంతిమంతంగా ఉంటుంది. చర్మం మీద పేరుకున్న దుమ్ము, వ్యర్థాలను బయటికి పంపడానికీ ఉపయోగపడుతుంది. పడుకునే ముందు దూది ఉండను తీసుకుని విటమిన్-ఇ ఆయిల్ ముఖానికి పట్టించాలి. పొద్దున్నే కడిగేసుకుంటే ముఖం మీది మలినాలు పోతాయి.
- ముఖం మీద ఇబ్బందికరంగా కనిపించే మొటిమలు, మచ్చలు, చారలను పోగొట్టడానికీ విటమిన్-ఇ ఆయిల్ పనికొస్తుంది.
- సూర్యరశ్మి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల కారణంగా చర్మం కమిలిపోతే, పడుకునే ముందు విటమిన్-ఇ ఆయిల్ రాసుకుని.. మరుసటి రోజు శుభ్రం చేసుకోవాలి.
- చర్మం మీద పగుళ్ల నివారణలోనూ ఈ నూనె సహాయ కారిగా ఉంటుంది. చర్మం రంగు మారకుండా, పిగ్మెంటేషన్ బారినపడకుండా చూడటంలో కీలకపాత్ర పోషిస్తుంది.
- చేపలు, బాదం, మామిడిపండు మొదలైన వాటిలో నేరుగా ఈ విటమిన్ లభిస్తుంది.
– డా. యశోద పెనుబాల, ప్రసూతి &స్త్రీ వైద్య నిపుణులు
డా.బూర్గుల రామకృష్ణారావు, ఆయుర్వేద వైద్య కళాశాల
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

