NRI | మల్కాజిగిరి ప్రజలు ఓడించినా మైనంపల్లికి బుద్ది రాలేదు : అశోక్ గౌడ్ దూసరి
NRI | ఎన్నికల్లో మల్కాజిగిరి ప్రజలు మైనంపల్లి హనుమంత రావు (Mainampalli Hanumantha Rao)ని ఓడించినా బుద్ధి రాలేదని ఎన్నారై బీఆర్ఎస్ ఎన్నారై యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు.
లండన్ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి ప్రజలు మైనంపల్లి హనుమంత రావు (Mainampalli Hanumantha Rao)ని ఓడించినా బుద్ధి రాలేదని ఎన్నారై బీఆర్ఎస్ ఎన్నారై యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కూడా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై వ్యక్తిగత విమర్శలు చేశారు. కానీ, ప్రజలు ఓటుతో బుద్ది చెప్పారు. అయినా ఇంకా సిగ్గు లేకుండా అవే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైనంపల్లి నిజంగానే వయసులో పెద్దవాడైతే సంస్కారవంతంగా మాట్లాడి, నిర్మాణాత్మక విమర్శలు చెయ్యాలి. కానీ ఇలా వీధి రౌడీ లాగా మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అశోక్ తెలిపారు. మైనంపల్లి హనుమంత రావు రాజకీయ జీవితం ముగిసిందని తాను ఎక్కడ నిలబడి ఓటు అడిగినా ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని తెలుసుకొని అసహనంతో, మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని విమర్శించారు. నేడు బీఆర్ఎస్ పార్టీకి తాత్కాలిక విరామం మాత్రమేనని కార్యకర్తలమంతా కేసీఆర్ వెంటే ఉంటామన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

