Supreme Court | నేర విచారణకు గవర్నర్లు అతీతులా?
ఎలాంటి క్రిమినల్ కేసులకు సంబంధించిన నేర విచారణ నుంచి అయినా గవర్నర్లకు రాజ్యాంగపరంగా రక్షణ కల్పించే రాజ్యాంగంలోని 361 అధికరణను పరిశీలించడానికి సుప్రీం కోర్టు శుక్రవారం అంగీకరించింది.
- 361 ఆర్టికల్ న్యాయ సమీక్షకు సుప్రీం కోర్టు అంగీకారం
- కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చాలని సూచన
Supreme Court | న్యూఢిల్లీ, జూలై 19: ఎలాంటి క్రిమినల్ కేసులకు సంబంధించిన నేర విచారణ నుంచి అయినా గవర్నర్లకు రాజ్యాంగపరంగా రక్షణ కల్పించే రాజ్యాంగంలోని 361 అధికరణను పరిశీలించడానికి సుప్రీం కోర్టు శుక్రవారం అంగీకరించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ రాజ్‌భవన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిని దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. తాను దీనిపై ఫిర్యాదు చేసినా గవర్నర్‌ను విచారించడం లేదని తెలిపింది.
రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు తప్పు చేసినా ఈ అధికరణను అడ్డుపెట్టుకుని విచారణను తప్పించుకుంటున్నారని, కాబట్టి 361 ఆర్టికల్‌పై న్యాయ సమీక్ష చేయాలని, క్రిమినల్ కేసుల నుంచి మినహాయింపు పొందకుండా తగు మార్గదర్శకాలు జారీ చేయాలని ఆ మహిళ విజ్ఞప్తి చేసింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో కేంద్రాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ను కోరింది. దీనిపై స్పందన తెలపాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో న్యాయస్థానానికి తమ సహాయాన్ని అందించాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని కోర్టు కోరింది. రాజ్యాంగ విధుల్లో ఉన్నప్పుడు రాష్ట్రపతి గానీ, గవర్నర్ గానీ ఏ న్యాయస్థానానికి జవాబుదారీ కాదని, ఈ విషయంలో వారికి అధికరణ 14 నుంచి మినహాయింపు ఉంటుందని 361 అధికరణ చెబుతున్నది.
నీట్-ఎస్ఎస్ నిర్వహించకపోవడంపై కేంద్రానికి నోటీసులు
నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షను 2024లో నిర్వహించరాదని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తీసుకున్న నిర్ణయంపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎమ్డీ, ఎంఎస్, డీఎన్బీ వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు గల వైద్యులు లేదా వాటికి సమానమైన విద్యార్హతలు గలవారు ఈ ప్రవేశ పరీక్షను రాస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో చేరవచ్చు. 13 మంది దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం, ఎన్ఎంసీ, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

