సచిన్ వాజేను అరెస్టు చేయండి.. అసెంబ్లీలో ఫడ్నవీస్ డిమాండ్

ముంబై: ముంబైలోని ముఖేశ్ అంబానీ ఇంటి ముందు బాంబులతో వదిలివెళ్లిన కారు ఘటన వ్యవహారం ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీలో తీవ్ర దుమారం లేపింది. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరుగాంచిన ఏపీఐ సచిన్ వాజేను ఈ కేసులో అరెస్టు చేయాలని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ముఖేశ్ అంబానీ ఇంటి ముందు కనిపించిన కారు.. గత నాలుగు నెలల నుంచి ఇన్స్పెక్టర్ సచిన్ వాజే వద్దే ఉన్నట్లు తెలిపారు. కారు ఓనర్ అయిన మన్సూక్ హీరన్ ఆ తర్వాత శవమై కనిపించాడు. తన భర్తను ఇన్స్పెక్టర్ సచిన్ చంపి ఉంటారని మన్సూక్ హిరెన్ భార్య ఆరోపిస్తున్నట్లు ఫడ్నవీస్ సభలో వెల్లడించారు. శివసేన నేత ధనంజయ్ గాద్వే ఆఫీసు వద్ద చివరిసారి మన్సూక్ హిరన్ ఫోన్ లొకేషన్ చూపించినట్లు అతని భార్య చెప్పిందన్నారు.
ధనంజయ్ గాద్వేతో పాటు ఇన్స్పెక్టర్ సచిన్ వాజేలు 2017లో చోటుచేసుకున్న బెదిరింపుల కేసులో ఉన్నారని ఫడ్నవీస్ ఆరోపించారు. మాజీ సీఎం ఫడ్నవీస్ చేసిన ఘాటు ఆరోపణలతో సభలో గందరగోళం నెలకొన్నది. యే సర్కార్ ఖూనీ హై అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో సభను వాయిదా వేశారు. ఖ్వాజా యూనిస్ కస్టడీ డెత్ కేసులో 2007లోనే పోలీసు ఆఫీసర్ సచిన్ వాజే బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఘాట్కోపర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడైన ఖ్వాజా కస్టడీలో చనిపోయాడు. అయితే ఆ కేసులో ఆఫీసర్ సచిన్‌పై విధించిన సస్పెన్షన్‌ను గత ఏడాది ఎత్తివేశారు. కోవిడ్ సంక్షోభం వేళ పోలీసుల సంఖ్య తక్కువ ఉన్నందుకు 2020 జూన్‌లో మళ్లీ సచిన్ వాజే విధుల్లో చేరినట్లు తెలుస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

