హత్యలకు పాల్పడుతున్న దంపతుల అరెస్ట్
హత్యలకు పాల్పడుతున్న దంపతుల అరెస్ట్ | నగరంలో హత్యలకు పాల్పడుతున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. బాలానగర్ డీసీపీ పద్మజ బుధవారం నిందితులను మీడియా

హైదరాబాద్ : నగరంలో హత్యలకు పాల్పడుతున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. బాలానగర్ డీసీపీ పద్మజ బుధవారం నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారానికి చెందిన స్వామి, నర్సమ్మ అనే దంపతులు కూలీ పనులను ఇప్పిస్తామంటూ నమ్మబలికి హత్యలకు పాల్పడుతున్నారు. అనంతరం వారి నుంచి ఆభరణాలు, నగదు దోచుకెళ్తున్నారు. ఈ నెల 25న మల్లాపూర్లో మహిళా కూలీ అదృశ్యమైంది. నిందితులిద్దరూ సదరు మహిళా కూలీకి పని కల్పిస్తామని తీసుకెళ్లి హత్య చేశారు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న బంగారు నగలు, ఫోన్ ఎత్తుకు వెళ్లారు. హత్యపై కేసుపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. ఇప్పటి వరకు ఇద్దరు కలిసి నలుగురిని హత్య చేసినట్లు అంగీకరించారన్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించనున్నట్లు వివరించారు.
ఇవి కూడా చదవండి..
కొవిషీల్డ్ రెండో డోసు తర్వాత ఆ సమస్య ఉండదు..!
దేశంలో కొత్తగా 43,509 కరోనా కేసులు
Bharti Arora | ‘శ్రీకృష్ణుడి సేవ’ కోసం ఐపీఎస్కు రాజీనామా..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

