Health Tips | మసాలా ఫుడ్స్‌లో నిమ్మరసం పిండుకుంటున్నారా.. అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..!
Health Tips : నిమ్మకాయలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఒంట్లో వేడిని తగ్గించడానికి, డీహైడ్రేషన్‌కు గురైన బాడీని వెంటనే హైడ్రేట్ చేయడానికి నిమ్మరసాన్ని వినియోగిస్తుంటారు. పరగడుపునే నిమ్మరసంతో షర్బత్ చేసుకుని తాగితే కడుపులోని మలినాలు సులువుగా బయటికి పోతాయంటారు. అదేవిధంగా కొన్ని రకాల ఆహార పదార్థాలకు కూడా నిమ్మ పులుపు తోడైతే ఆ ఆహారానికి కమ్మదనం వస్తుంది. కానీ ఈ నిమ్మరసం కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిస్తే విషపూరితం అయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి నిమ్మరసంతో కలపకూడని ఆ పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలు, పాల సంబంధ ఉత్పత్తులతో నిమ్మరసాన్ని కలుపగూడదు. ఏ రకమైన పాల ఉత్పత్తులతో కూడా నిమ్మకాయను కలిపి తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. పాలు, నిమ్మరసం ఒకేసారి తాగడం ఆరోగ్యానికి హానికరమని, దాంతో గుండెల్లో మంటగా అనిపించడం, వాంతులు అవడం లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
అదేవిధంగా మసాలా వంటకాల్లో కూడా నిమ్మరసాన్ని ఉపయోగించడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బిర్యానీలు, ఇతర మసాలా ఆహారాల్లో ఘాటును భరించడం కోసం, పుల్లని రుచి కోసం చాలా మంది నిమ్మరసాన్ని పిండుకుంటారు. కానీ దానివల్ల ఎసిడిటీ బారినపడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉండటమేగాక ఆ నిమ్మకాయ పిండుకోవడంవల్ల మసాలా ఘాటు తగ్గుతుంది. దాంతో అతిగా మసాలాను తీసుకుంటాం. ఇది ఎసిడిటీకి కారణమవుతుంది.
రెడ్ వైన్ తీసుకునేటప్పుడు కూడా నిమ్మకాయను ఏ రూపంలోనూ తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. నిమ్మ రసం వైన్ రుచిని, వాసనను చెడగొట్టడమేగాక ఆరోగ్యానికి హాని చేస్తుంది. పెరుగు, చల్ల లాంటి పాల ఉత్పత్తులతో కూడా నిమ్మరసం తీసుకోవడం మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం పాల ఉత్పత్తులతో నిమ్మరసం జోడించడం ఆరోగ్యానికి హానికరం. నిమ్మరసం శరీరంలో ఎసిడిటీని కలిగిస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | కొండాపూర్‌లో అక్రమ సెల్లార్ నిర్మాణం.. కూలిన పక్క హోటల్ గోడ, పలువురికి గాయాలు!
Road Accident | ఇచ్చోడ జాతీయ రహదారిపై కారు బోల్తా.. నలుగురికి గాయాలు
గద్వాల ఆర్టీవో కార్యాలయం ఎదుట లారీ డ్రైవర్ల ఆందోళన.. DTOతో మాట్లాడిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
Niranjan Reddy | ప్రభుత్వ కార్యాలయం కోసం పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేయొద్దు: నిరంజన్ రెడ్డి
KTR | ‘ఆకాశంలో ఒక తార’పై కేటీఆర్ ప్రశంసల వర్షం.. చాలా కాలం తర్వాత ఇంత మంచి సినిమా చూశానంటూ కామెంట్స్!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ