Health tips | చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..!
Health tips : చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్లు ఇలా ఇంకా ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే వైద్యులు చేపలను ఎక్కువగా తీసుకోవాలని చెబుతుంటారు. ఇది తెలిసి కూడా చాలామంది నాన్ వెజ్ ప్రియులు చేపల కంటే చికెన్, మటన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
Health tips : చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్లు ఇలా ఇంకా ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే వైద్యులు చేపలను ఎక్కువగా తీసుకోవాలని చెబుతుంటారు. ఇది తెలిసి కూడా చాలామంది నాన్ వెజ్ ప్రియులు చేపల కంటే చికెన్, మటన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కొందరు ముళ్ళు ఉంటాయని భయపడితే, ఇంకొందరు ఇళ్లంతా కవుసు వాసన వస్తుందని దూరం పెడుతారు. ఇగ కొందరు చేపలు తిన్నా దాని తల భాగాన్ని పడేస్తారు. వాస్తవానికి చేపల తలలో అధిక పోషక విలువలు ఉంటాయి.
కొంత మంది చేప తల తింటారు. కానీ, ఆ తలలో ఉండే కళ్లను ఛీ అంటూ వదిలేస్తారు. నిజానికి ఆ కళ్ళల్లో కూడా అద్భుతమైన పోషకాలు ఉంటాయి. చేప కళ్లను తింటే కంటిచూపు మెరుగుపడుతుంది. కళ్లకు మాత్రమే కాదు, గుండె ఆరోగ్యానికి కూడా చేప కళ్లు చాలా మంచిది. చేప కళ్లలోని పోషకాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. గుండెపోటు లాంటి సమస్యలను దూరం చేస్తాయి. అంతేగాక మెదడులో రక్త ప్రసరణను క్రమబద్ధీకరించడం ద్వారా పక్షవాతం లాంటి సమస్యలు రాకుండా తోడ్పడుతాయి.
ఆటిజం లాంటి మానసిక సమస్య నుంచి బయటపడేందుకు కూడా చేపల కళ్లు సహకరిస్తాయి. ఆటిజం ఉన్న వ్యక్తులు ఊరికెనే అలసిపోతారు. ప్రతి చిన్న విషయానికి ఆత్రుతను ప్రదర్శిస్తుంటారు. వీరిలో ఆసక్తి లోపం కూడా ఉంటుంది. అలాంటి వారు చేపల కళ్లు తింటే అందులో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు మెదడు పనితీరు మెరుగై జ్ఞాపకశక్తి పెరుగుతుంది. భావోద్వేగాలను సమతౌల్యమవుతాయి. కడుపులో ఉండే దీర్ఘకాలిక యాసిడ్ మంట తగ్గుతుంది.
అదేవిధంగా చేపల కళ్లల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ప్రశాంతమైన నిద్రకు విటమిన్ డి ఉపకరిస్తుంది. ఇక ట్యూనా, సాల్మన్ చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి. పైగా వాటిలో విటమిన్ డి మోతాదు మరింత ఎక్కువగా ఉంటుంది. చేపలు క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. నోరు, స్వర పేటిక, పెద్ద పేగు, క్లోమం వంటి అవయవాలకు వచ్చే క్యాన్సర్‌ను చేప మాంసం తగ్గిస్తుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ టెక్నికల్ న్యూట్రిషన్ అధ్యయనం తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

