APCC Chief YS Sharmila | తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌తో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి చెన్నైకి వెళ్లిన షర్మిల.. సీఎం కార్యాలయంలో విజయ్ను నేరుగా కలిసి కాసేపు ముచ్చటించారు. వచ్చే నెల నవంబర్ 25వ తేదీన జరగబోయే తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహ వేడుకకు రావాల్సిందిగా సీఎం విజయ్ను వారు సాదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు పెళ్లి పత్రికను అందించి, కుటుంబ సమేతంగా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.
ఈ సమావేశానికి సంబంధించిన విశేషాలను వైఎస్ షర్మిల సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి కలిసిన సీఎం విజయ్ చూపిన ఆప్యాయత ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా కాబోయే దంపతులకు విజయ్ శుభాకాంక్షలు తెలిపినట్లు షర్మిల పేర్కొన్నారు.
View this post on Instagram