AP Ministers | సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన ఏపీ మంత్రులు
AP Ministers | ఏపీ మంత్రులు గా ప్రమాణం చేసిన మంత్రుల్లో ఏడుగురు గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు.
అమరావతి : ఏపీ మంత్రులు(AP Ministers) గా ప్రమాణం చేసిన మంత్రుల్లో ఏడుగురు గురువారం పదవి బాధ్యతలు (Charges) చేపట్టారు. ఏపీ సచివాలయంలో వారికి కేటాయించిన కార్యాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు తీసుకున్నారు.
బీసీ సంక్షేమం, టెక్స్టైల్స్ శాఖ మంత్రిగా సవిత(Savitha) బాధ్యతలు చేపడుతూ అన్ని జిల్లాలో బీసీ స్టడీ సర్కిళ్ల ఏర్పాటుపై తొలి సంతకం చేశారు. ఎన్టీఆర్ విదేశీ విద్య(NTR Foreign Study) గా పేరు మార్పుపై రెండో సంతకం చేశారు. బీసీల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. వైసీపీ పాలనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పనితీరుపై మండిపడ్డారు. భవనాలకు రంగులు మార్చడం, నిత్యవసర సరుకుల ధరలను , ప్రజా వేదికను కూల్చడమే తప్ప బీసీలకు మేలు ఏమీ చేయలేదని ఆరోపించారు.

చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas) బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా 20 ఆదర్శ మండలాల ప్రకటనపై తొలి సంతకం, ఎస్సీ, ఎస్టీ స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాలపై రెండో సంతకం చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తెలుగుజాతి కల పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.
పరిశ్రమల శాఖ మంత్రిగా టీజీ భరత్ బాధ్యతలు స్వీ్కరించారు. సచివాలయంలోని ఐదో బ్లాక్లో వాసంశెట్టి సుభాష్(Vasamshetty Subash) కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

