టిక్రీ సరిహద్దులో మరో రైతు ఆత్మహత్య

న్యూఢిల్లీ : టిక్రీ సరిహద్దులో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాను నిరసిస్తూ గత కొంతకాలంగా ఢిల్లీ సరిహద్దుల్ని పలు ప్రాంతాల్లో రైతులు గత 101 రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసింది. వంద రోజులు దాటినా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న నిరాశతో రైతు ఆత్మహత్య చేసుకుని కేంద్రాన్ని ఉద్దేశించి ఒక లేఖ రాసినట్లుగా తెలుస్తున్నది.
ఆదివారం ఉదయం ఆందోళన చేస్తున్న వేదికకు 7 కిలోమీటర్ల దూరంలోని ఓ చెట్టుకు ఓ రైతు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడిని హర్యానాలోని హిస్సార్ జిల్లాకు చెందిన రాజ్బీర్ (49) గా గుర్తించారు. రైతు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని బహదూర్గఢ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్‌కుమార్ ధ్రువీకరించారు. మృతుడు గత కొంతకాలంగా తోటి రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొంటున్నాడు. ఉద్యమం వంద రోజులు పూర్తయినా కేంద్రం నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో తీవ్ర నిరాశకు లోనై వేదికకు సమీపంలోని ఓ చెట్టుకు ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్రం తీసుకువచ్చిన మూడు చట్టాల కారణంగానే తానీ అడుగు వేయాల్సి వచ్చిందని, తన చివరి కోరికగా ఆ మూడు చట్టాలను విరమించుకుని రైతులకు మేలు చేయాలని తన సూసైడ్‌నోట్ లో రాజ్బీర్ పేర్కొన్నాడు. గత నెలలో కూడా హర్యానాకు చెందిన ఇదే టిక్రీ సరిహద్దు వద్ద చెట్టుకు ఉరేసుకుని బలవంతంగా ప్రాణాలు వదిలాడు. మరో రైతు కూడా విషం తీసుకోగా.. చికిత్స నిమిత్తం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. కాగా, గత ఏడాది డిసెంబర్ నెలలో రోజుల వ్యవధిలో ఇద్దరు రైతులు ఇదే మాదిరిగా ప్రాణాలు విడిచారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల మంచిని కోరి తాము తీసుకొచ్చిన చట్టాలను ఉపసంహరించుకోవాలని టిక్రీలో ఆందోళన చేస్తున్న రైతులు ముక్తకంఠంతో నినదించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

