హోండా నుంచి సరికొత్త ఫీచర్స్ తో మరో బైక్..

ఢిల్లీ ,మే, 28: జపాన్ కు చెందిన హోండా కంపెనీ మరో సరికొత్త ఫీచర్స్ తో వాహనాలను ప్రపంచానికి అందిస్తుంది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్, ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలో మరో కొత్త ఎంట్రీ లెవల్ మోడల్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ బిఎస్6 యుగంలో కంపెనీ ఇప్పటికే హైనెస్ సిబి350 , సిబి350ఆర్ఎస్ అనే రెండు ప్రీమయం మోటార్‌సైకిళ్లను విడుదల చేసిన విషయం తెలిసినదే.ఇక తాజాగా ఇప్పుడు ఈ కంపెనీ కొత్తగా హోండా సిబి300ఆర్ అనే ఎంట్రీ లెవల్ ప్రీమియం బైక్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
ఇక ఒకవేళ హోండా తమ సిబి300ఆర్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో ప్రారంభించాలని నిర్ణయించుకుంటే, అది బ్రాండ్ప్రీమియం బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారానే అమ్మటం జరుగుతుందట. ఇక హోండా బిఎస్4 వెర్షన్లో వాడిన అదే ఇంజన్‌ను కంపెనీ బిఎస్6 కాలుష్య నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి ఇందులో ఉపయోగించనుంది.
ఈ అప్‌గ్రేడెడ్ ఇంజన్ పవర్ ,టార్క్ గణాంకాల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవట. ఇక బిఎస్ 4 మోటార్‌సైకిల్‌లో 286సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను వాడారు. ఈ ఇంజన్ ఎక్కువగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 31.4 బిహెచ్పి శక్తిని 6500 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో మిక్స్ అయ్యి ఉంటుంది.మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ 300సీసీ బైక్ ధర సుమారు రూ.2.41 లక్షలు, (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంటుందని అంచనా.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- auto
- automobile
- new bike
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

