ప్రయివేటీకరణకు మరో బ్యాంకు రెడీ…

ముంబై ,మే 6:మరో బ్యాంకును ప్రయివేటుపరం చేయడానికి రంగం సిద్ధమైంది. కేంద్రసర్కారు బడ్జెట్ లో ప్రతిపాదించిన నిర్ణయాల అమలు దిశగా అడుగులు వేస్తున్నది. ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, యాజమాన్య నియంత్రణ బదిలీకి కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయ అనుమతులు ఇచ్చింది. ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి, ఎల్ఐసీకి కలిపి 94 శాతానికి పైగా వాటా ఉంది.
49.21 శాతం వాటాతో ఎల్ఐసీ ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో యాజమాన్య నియంత్రణ కలిగిన ప్రమోటరుగా ఉంది. ఎల్ఐసీ, ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా ఐడీబీఐ బ్యాంక్ వ్యాపార వృద్ధికి అవసరమైన కొత్త సాంకేతికతను, మూలధనాన్ని, ఉత్తమ యాజమాన్య ప్రమాణాలను కొత్త కొనుగోలుదారు తీసుకొస్తారని భావిస్తున్నామని ఆ ప్రకటన పేర్కొంది.
ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటా విక్రయానికి ఆర్థిక వ్యవహారాలపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపిందని బుధవారం ఓ అధికారిక ప్రకటన వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీ ఎంత మేర వాటాలు విక్రయిస్తాయనే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో సంప్రదింపుల తర్వాత నిర్ణయిస్తారని పేర్కొంది. ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా తగ్గించుకునేందుకు ఎల్ఐసీ బోర్డు కూడా ఆమోదం తెలిపిందని తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Om | ‘ఓమ్’ చిత్రంలో సాయిపల్లవి పవర్ఫుల్ పోలీస్ రోల్.. ఆ రియల్ ఆఫీసర్ స్పూర్తే కారణం!
రేవంత్ రెడ్డికి మెడికవర్ హాస్పిటల్స్‌పై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ దవాఖానలపై ఎందుకు లేదు? : మన్నె క్రిశాంక్
కారేపల్లి మండల అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రత్యేక అధికారి ఆలేటి ప్రమీల
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

