చినిగిన చొక్కా అయిన తొడుక్కో ఓ మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం పంతులు అన్నారు. అవును పుస్తకానికి అంత ప్రాధాన్యత ఉంది మరీ.. పుస్తకాలు చదవడం ద్వారా వచ్చే జ్ఞానంతో మనం ఎక్కడైనా తలెత్తుకొని బతుకొచ్చు. మరి ఏ పుస్తకాలు చదవాలి..? అన్ని పుస్తకాలను చూసి కొనే అవకాశం ఉందా? అని వెదికే వారికోసమే హైదరాబాద్‌లో పుస్తకాల జాతర సాగుతున్నది. పుస్తకాలను అపురూపంగా ప్రేమించేవారి కోసం.. ప్రపంచవ్యాప్తం గా కొత్తగా విడుదలైన పుస్తకాల కోసం ఎదురుచూసే వారి కోసం బుక్‌ఫెయిర్ కొలువుదీరింది. మరి ఈ బుక్ఫెయిర్లో ఏ పుస్తకాలు దొరుకుతాయి? బుక్‌స్టాల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసొద్దాం పదండి..