ముంబై: ఈ యేటి ఐపీఎల్లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వరుసగా మూడు ఓటముల తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 23 రన్స్ తేడాతో చెన్నై గెలిచింది. తొలుత బ్యాటర్లు శివమ్ దూబే, రాబిన్ ఊతప్పలు భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఇక ఫీల్డింగ్ సమయంలోనూ చెన్నై ప్లేయర్స్ కేక పుట్టించారు. అంబటి రాయుడు 16వ ఓవర్లో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. కుడి వైపు డైవ్ చేస్తూ వంటి చేతిలో ఆకాశ్ దీప్ ఇచ్చిన క్యాచ్‌ను పట్టేశాడు. రవీంద్ర జడేజా ఆ ఓవర్లో బౌలింగ్ చేశాడు. గుడ్లెన్త్ బాల్‌ను షార్ట్‌గా బౌల్ చేయడంతో అది కాస్త ఆగి వచ్చింది. ఆకాశ్ దీప్ దాన్ని పుష్ చేశాడు. షార్ట్ కవర్లో ఉన్న రాయుడు.. ఫుల్ లెన్త్ డైవ్ చేస్తూ క్యాచ్ పట్టుకున్నాడు. ఆ క్యాచ్ వీడియో ఇదే.
One handed stunner from Rayudu 🔥#RCBvsCSK #IPL2022 #CSK #AmbatiRayudu pic.twitter.com/5yth0BcfWp
— cricket_meme_haul (@cric_meme_haul) April 12, 2022