కలంబంద.. సాగు ఎలా?
కలబంద ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయని మా మిత్రుడు చెప్పాడు. నేను కూడా ఈ పంటను సాగు చేయాలని అనుకుంటున్నా. దీనికి సంబంధించిన సాగు, వాణిజ్య వివరాలు తెలుపగలరు. – రాజిరెడ్డి, మహబూబ్‌నగర్.
ప్రస్తుతం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పంటల్లో కలబంద సాగు కూడా ఒకటి. ఇది దివ్యమైన ఔషధ పంట. అందుకే, కలబందకు ప్రపంచ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. వివిధ ఔషధాలు, పలు రకాల సబ్బులు, క్రీములు, లోషన్ల తయారీలో దీనిని విరివిగా వాడుతున్నారు. ఆరోగ్యపరంగానూ వాడకం ఎక్కువైంది.
ఇక సాగు విషయానికి వస్తే.. కలబంద సాగుకు మన వాతావరణం బాగా సరిపోతుంది. అన్ని రకాల నేలల్లోనూ పెరుగుతుంది. ఇసుక నేలలైతే అత్యంత అనుకూలం. అయితే భూగర్భ జలాలు కాస్త ఎక్కువగా ఉండే నేలను ఎంచుకోవాలి. నీటి వాడకం కూడా తక్కువే. జూలై నుంచి ఆగస్టు మధ్యలో మొక్కల్ని నాటుకోవాలి. సాగు ఖర్చు విషయానికి వస్తే.. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారం.. ఒక హెక్టార్ (2.4 ఎకరాలు) సాగు చేయడానికి రూ.27,500 ఖర్చు అవుతుంది. కూలీల ఖర్చు, సాగు ఏర్పాట్లు, పురుగు మందులు అన్నీ కలిపి ఏడాదికి మొత్తం ఖర్చు రూ.50 వేలు మించదు. హెక్టార్ పొలంలో ఏడాదికి 40 టన్నుల నుంచి 50 టన్నుల దాకా దిగుబడి వస్తుంది.
ఆయుర్వేద కంపెనీలు, కాస్మెటిక్, సబ్బుల తయారీ కంపెనీలు కొనుగోలు చేస్తాయి. ఆకులు మందంగా, పెద్దగా ఉంటే.. ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అనేక సంస్థలు టన్ను ఆకులకు రూ.15 వేల నుంచి రూ.25 వేల దాకా ఇస్తున్నాయి. ఈ లెక్కన ఏడాదికి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఆదాయం వస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

