ఉప్పెన చిత్ర యూనిట్‌కు బన్నీ ప్రశంసలు

షూటింగ్ బ్రేక్‌లో ఈ సినిమా చూసిన అల్లు అర్జున్.. చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు మెచ్చుకున్నారు. ముఖ్యంగా హీరో వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్ గురించి ప్రశంసించారు. తొలి సినిమాతోనే అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అని పొగిడారు. వైష్ణవ్‌కు అద్భుతమైన డెబ్యూ దొరికింది అని తెలిపారు అల్లు అర్జున్. అలాగే హీరోయిన్ కృతి శెట్టి.. విజయ్ సేతుపతి నటన గురించి ప్రశంసించారు.
ఒక సున్నితమైన పాయింట్ తీసుకొని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబు పనితీరు గురించి ప్రత్యేకంగా ప్రశంసించారు అల్లు అర్జున్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థను పొగడ్తల్లో ముంచెత్తారు బన్నీ. ఏ నిర్మాత అయినా రిస్క్ లేని కథలు చేయాలనుకుంటారు.. కానీ రిస్కు ఉంది అని తెలిసినా కూడా కథను నమ్మి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఉప్పెన సినిమా.. కథలపై వాళ్లకున్న నమ్మకాన్ని, ధైర్యాన్ని తెలియజేస్తుందన్నారు అల్లు అర్జున్. ఓవరాల్‌గా ఉప్పెన సినిమా తనకు చాలా బాగా నచ్చిందని.. ఇలాంటి అద్భుతమైన సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు స్టైలిష్ స్టార్. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలోనే పుష్ప సినిమాలో నటిస్తున్నారు అల్లు అర్జున్.
ఇవి కూడా చదవండి..
మెగా హీరో సినిమాలో బిగ్ బాస్ భామ..!
ఆర్ఆర్ఆర్ నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ పిక్ లీక్..!
స్నేహితురాలి పెళ్లిలో తమన్నా సందడి మాములుగా లేదు
హీరోని చూసేందుకు నీళ్ళల్లోకి దూకిన అభిమాని
తాప్సీ, అనురాగ్ ల్యాప్‌టాప్, ఫోన్లు సీజ్
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- Bunny
- Kritishetty
- pushpa
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

