న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్..ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అల్ట్రోజ్‌ను ‘డార్క్’ ఎడిషన్‌గా పరిచయం చేసింది. ఈ కారు విడుదల చేసి రెండేండ్లు పూర్తైన సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక ఎడిషన్ ప్రారంభ ధర రూ.7.96 లక్షలుగా నిర్ణయించింది. ప్రీమియం ైస్టెలింగ్, అత్యంత ప్రజాదరణ పొందిన ఫీచర్స్‌తో ఈ మోడల్‌ను తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గడిచిన రెండేండ్లలో 1.2 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.