Supreme Court: సుప్రీంకోర్టు జడ్జీల సంచలన నిర్ణయం.. వెబ్సైట్లో ఆస్తుల వివరాలు
Supreme Court: సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. దీనిపై ఇటీవల జరిగిన ఫుల్ కోర్టు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. తమ ఆస్తుల వివరాలను పబ్లిక్‌గా వెల్లడించేందుకు జడ్జీలు ఏకగ్రీవంగా అంగీకరించారు.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు(Supreme Court) న్యాయమూర్తులు ఇవాళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ వ్యక్తిగత ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు నిర్ణయించారు. పారదర్శకతతో పాటు ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని నింపేందుకు ఈ చర్యకు పూనుకున్నారు. డిక్లరేషన్ ద్వారా ఆస్తులు వివరాలను వెల్లడించేందుకు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా అంగీకరించారు.
ఏప్రిల్ ఒకటో తేదీన జరిగిన ఫుల్ కోర్టు మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తికి తమ ఆస్తులు వివరాలను వెల్లడించేందుకు జడ్జీలు నిర్ణయించారు. సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో ఆస్తుల వివరాలను అప్లోడ్ చేయనున్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జీ జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో డబ్బు దొరికిన అంశం వివాదాస్పదం కావడంతో సుప్రీం న్యాయమూర్తులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
అసెట్స్‌ను డిక్లేర్ చేసే విధివిధానాలను త్వరలో ఖరారు చేయనున్నారు. వాస్తవానికి ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న అందరు జడ్జీలు తమ ఆస్తుల వివరాలను డిక్లేర్ చేశారు. కానీ ఆ వివరాలను పబ్లిక్‌గా రిలీజ్ చేయలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

