Ajinkya Rahane Catch | టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే (Ajinkya Rahane) అధ్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో (India vs West Indies) జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆట(2nd Test Day 3)లో అసాధారణ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా వెస్టిండీస్ బ్యాటర్ బ్లాక్‌వుడ్ (Black wood) ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్ ఫీల్డర్‌గా ఉన్న రహానే అమాంతం గాల్లోకి ఎగిరి సింగిల్ హ్యాండ్‌తో బంతిని అద్భుతంగా అందుకున్నాడు. ఇక రహానే సూపర్మాన్ విన్యాసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
మరోవైపు వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 229 స్కోరు చేసింది. ప్రస్తుతం క్రీజులో జేసన్ హోల్డర్ (11), అథనేజ్ (37) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ జట్టు ఇంకా 209 పరుగుల వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, అశ్విన్, తొలి టెస్టు ఆడుతున్న ముఖేశ్ కుమార్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
Good sharp catch from Rahane 👏👏👏 pic.twitter.com/NNA1D0e7Bo
— Raja 🇮🇳 (@Raja15975) July 22, 2023