Hijacking threat call : ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు కాల్
Hijacking threat call : ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు కాల్ | పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా కార్యాలయానికి బుధవారం రాత్రి బెదిరింపు వచ్చింది. రాత్రి 7 గంటల సమయంలో ఓ దుండగుడు విమానాన్ని హైజాక్ చేయనున్నట్లు ఫోన్ చేశాడు.

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా కార్యాలయానికి బుధవారం రాత్రి బెదిరింపు వచ్చింది. రాత్రి 7 గంటల సమయంలో ఓ దుండగుడు విమానాన్ని హైజాక్ చేయనున్నట్లు ఫోన్ చేశాడు. అయితే, సదరు వ్యక్తి బెంగాళీలో మాట్లాడడని.. తన పేరును ప్రశాంత బిశ్వాస్‌గా చెప్పాడని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అయితే, దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
వెంటనే అప్రమత్తమైన అధికారులు స్థానిక బిధానగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు సదరు వ్యక్తి కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎయిర్ ఇండియా కార్యాలయానికి వచ్చిన కాల్ ఆధారంగా ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేశారు. ఉత్తర 24 పరగనాస్ జిల్లాలోని బొంగావ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఫోన్ చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతని మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తుండగా.. పోలీసులు విచారిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

