కిచెన్ బడ్జెట్ భారం : పెట్రో మంటలకు తోడు వంట నూనెల సెగ!

న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు సెంచరీ దాటి పరుగులు పెడుతుంటే తాజాగా వంట నూనె ధరలూ వంటగది బడ్జెట్‌కు షాకిస్తున్నాయి. గత ఏడాదిగా వంట నూనెల ధరలు ఏకంగా 30 నుంచి 60 శాతం పైగా ఎగబాకడంతో గృహిణులు గగ్గోలు పెడుతున్నారు. వంట నూనెలతో పాటు పామాయిల్, సోయా నూనెల ధరలు భగ్గుమంటున్నాయి. ఏడాది కిందట రూ 100 పలికిన కిలో వంట నూనె ప్రస్తుతం ఏకంగా దాదాపు రూ 150కిపైగా ఎగబాకింది. వంట నూనెలు సలసలా కాగుతుండటంతో వంటింటి బడ్జెట్ పెరిగి సామాన్యులు, మధ్యతరగతి సహా పేద మహిళలు వంట అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
ప్రపంచ వ్యాప్తంగా వంట నూనెల సరఫరా తగ్గడంతో నూనెలకు డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో ధరలు చుక్కలు తాకుతున్నాయి. చైనాలో సోయాబీన్‌కూ డిమాండ్ పెరిగింది. మరోవైపు బ్రెజిల్, అర్జంటీనాల్లో ప్రతికూల వాతావరణంతో నూనెల ఉత్పత్తి దెబ్బతింది. మరోవైపు దేశీ మార్కెట్లోనూ వినియోగం పెరగడంతో పాటు పండగ సీజన్లో వంటనూనెలకు డిమాండ్ ఎగబాకే క్రమంలో రాబోయే రోజుల్లో నూనెల ధరలు మరింత పెరుగుతాయనే వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- oil-prices
- petrol prices
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

