Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Actress Surekha Vani | ప్రముఖ తెలుగు చలనచిత్ర నటి సురేఖ వాణి వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేగింది.
Actress Surekha Vani | ప్రముఖ తెలుగు నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ కావడంతో సోషల్ మీడియాలో కలకలం రేగింది. హ్యాకర్లు ఆమెకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత, ప్రైవేట్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ పరిణామంపై సురేఖ వాణి తీవ్రంగా స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
తన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయిందని, తన ప్రైవేట్ కంటెంట్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మీమ్ పేజీలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెల్స్ మరియు సోషల్ మీడియా యూజర్లు ఎవరైనా సరే తన వ్యక్తిగత కంటెంట్‌ను షేర్ చేయడం, రీపోస్ట్ చేయడం లేదా అప్లోడ్ చేయడం వెంటనే ఆపేయాలని ఆమె స్పష్టం చేశారు. కేవలం వ్యూస్, లైక్స్ మరియు పబ్లిసిటీ కోసం ఇలాంటి బాధ్యతారహితమైన పనులకు పాల్పడటం సరికాదని హితవు పలికారు.
ఇది తన వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన అత్యంత సున్నితమైన అంశమని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సురేఖ వాణి స్పష్టం చేశారు. ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఎవరైనా సరే తన ప్రైవేట్ కంటెంట్‌ను షేర్ చేసినా, ప్రచారం చేసినా వారి వివరాలు సేకరించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన ప్రైవసీని గౌరవించాలని ఆమె అందరికీ విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

