పూల చెట్టు ఊగినట్టు.. పాలబొట్టు చిందినట్టు.. మ్యాక్సీ డ్రెస్‌లో కనికట్టు చేస్తున్న ఈ చిన్నది.. ధన్యా బాలకృష్ణ. అచ్చ తెలుగు అందంలా కనిపించే ఈ కన్నడ భామ నీలం రంగు హాఫ్ షోల్డర్ మ్యాక్సీ డ్రెస్‌లో కొత్తగా మెరిసిపోతున్నది. ఫ్లోరల్ తరహాలో వచ్చిన ఈ గౌనుకు పొడవాటి బెల్ హ్యాండ్స్ ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చాయి.
మెడలో రోడియం కోట్ గుండ్లు, చిన్న లాకెట్‌తో రెండు వరుసల్లో వచ్చిన నాజూకైన గొలుసు.. ఆమె అవుట్‌ఫిట్‌కి పర్ఫెక్ట్ ఫిట్ అనిపిస్తున్నది. చెవి రింగుల్లో పొదిగిన తెల్లరాళ్లు చెంపల మెరుపుతో పోటీ పడుతున్నాయి.
కుడిచేతికి ఫ్యాషనబుల్‌గా మల్టీలైనర్ బీడ్స్ బ్రేస్లెట్ ధరించి ఆహార్యాన్ని ఆహా అనిపించేలా పూర్తి చేసిందీ ‘జగమే మాయ’ సినిమా హీరోయిన్. అన్నట్టు, ధన్య సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది, రకరకాల ముస్తాబులతో ఆకట్టుకునేలా కనిపిస్తుంది కూడా.