తమిళనాడు పోల్స్ : అభిమానులపై అజిత్ ఆగ్రహం.. సైకిల్‌పై వచ్చి ఓటేసిన విజయ్..
అజిత్ | ప్రముఖ నటుడు అజిత్‌కుమార్ భార్యత షాలినితో కలిసి తిరువాన్మియూర్లోని తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాధారణ ప్రజలతో పాటు పెద్ద రాజకీయ, సినీ ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ప్రముఖ నటుడు అజిత్‌కుమార్ భార్యత షాలినితో కలిసి తిరువాన్మియూర్లోని తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సాధారణ ప్రజలతో కలిసి క్యూలైన్లో బారులు తీరారు. అంతకు ముందు అజిత్ పోలింగ్ కేంద్రానికి రాగానే అభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో అజిత్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సెల్ఫీ దిగేందుకు యత్నించిన ఓ అభిమాని ఫోన్‌ను లాక్కున్నాడు. ఫోన్‌ను వ్యక్తిగత సిబ్బందికి అందజేశాడు. ఎంత సేపటికి ఫోన్‌ను తిరిగి ఇవ్వలేదు.

మరో వైపు ఇళయపతి విజయ్ సైకిల్‌పై వచ్చి ఓటు వేశారు. చెన్నైలోని నీలంకరైలోని వెల్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్లో ఓటు వేశారు. అభిమాన హీరో రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. అలాగే పెరియాకుళంలో డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం తన తల్లితో కలిసి వచ్చి ఓటు వేశారు. అన్నానగర్‌లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు మురుగన్, శివగంగ జిల్లా కందనూర్లో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం ఓటుహక్కును వినియోగించుకున్నారు.
Actor #Vijay comes to Neelangarai polling station riding a cycle. Probably taking a jibe at the #PetrolDieselPriceHike ?
— Smitha T K (@smitha_tk) April 6, 2021
Whatever be the reason, he sure has grabbed attention.
Read all updates on #TNAssemblyElection2021 here:
https://t.co/ad0qGmEJQ5#TNElection2021 pic.twitter.com/Od6uMz6uhO
ఇవి కూడా చదవండి..
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
ఓటు వేసిన డీఎంకే చీఫ్ స్టాలిన్
చెత్త ట్రాక్టర్లో వెంటిలేటర్ల తరలింపు
ఓటుహక్కును వినియోగించుకోండి : ప్రధాని పిలుపు
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 96,982 కొవిడ్ కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmer | అన్నదాతపై పోలీసుల దౌర్జన్యం.. భూమి పరిహారం అడిగినందుకు రైతు నర్సింహులుపై దాడి
బియ్యం రేటులో రైతుకు దక్కిందెంత?!
Gajwel | ఏం పీకనీకి ఎవుసం చేస్తున్నవ్.. పోలీస్‌స్టేషన్‌లో రైతుపై ఎస్సై దాష్టీకం
Rayadurgam | సర్కార్ భూములపై గద్దల్లా పెద్దలు.. రాయదుర్గంలో వందల కోట్ల ప్రభుత్వ భూములు కబ్జా!
దేశాన్ని కాపాడుతున్నది యువతనే!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

