యశ్వంత్ సిన్హాకు ఆమ్ ఆద్మీ సపోర్ట్..
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తాము మద్దతు ఇవ్వనున్నట్లు ఆమ్ ఆర్మీ పార్టీ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఈ ప్రకటన చేశారు. ఎన్డీఏ అభ్యర్థిగా ముర్ము పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జూలై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. జూలై 21న ఓట్లను లెక్కించనున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల తమకు గౌరవం ఉందని, కానీ తాము మాత్రం యశ్ంత్ సిన్హాకు సపోర్ట్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ తర్వాత ఆయన ఈ కామెంట్ చేశారు. ఢిల్లీ, పంజాబ్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తం 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఆ పార్టీ తరపున మొత్తం 156 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పంజాబ్లో 92, ఢిల్లీలో 62 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు గోవాలో ఉన్నారు. ముర్ముకు బీజేడీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజూ జనతాదళ్, బహుజన్ సమాజ్ పార్టీ, శిరోమణి అకాలీదళ్, శివసేనలు ఇప్పటికే మద్దతు తెలిపాయి. దీంతో ముర్ముకు అనుకూలంగా 60 శాతం ఓట్ షేర్ ఉంది. నామినేషనల్ సమయంలో ఆమెకు కేవలం 50 శాతం మంది మాత్రమే ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

