‘ధైర్యం, ఆత్మవిశ్వాసం మెండుగా కలిగిన యువకుడతడు. శత్రువు ఎంతటి బలవంతుడైనా ఎదురించి పోరాడే అతడి కథేమిటో తెలియాలంటే తెరపై చూడాల్సిందే’ అంటున్నారు ఆదిసాయికుమార్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘తీస్మార్ఖాన్’. కల్యాణ్‌జీ గోగన దర్శకుడు. నాగం తిరుపతిరెడ్డి నిర్మాత. పాయల్‌రాజ్‌పుత్ కథానాయిక. దసరా సందర్భంగా చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమాను తెరకెక్కిస్తున్నాం. విద్యార్థిగా, రౌడీగా, పోలీస్‌గా మూడు భిన్న పార్శాలతో కూడిన పాత్రలో అది కనిపిస్తారు. మునుపెన్నడు కనిపించని రీతిలో సరికొత్తగా ఆయన పాత్ర సాగుతుంది. సునీల్ క్యారెక్టర్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని తెలిపారు. అనూప్సింగ్ఠాకూర్, కబీర్‌సింగ్ కీలక పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తిక్, సినిమాటోగ్రఫీ:బాల్‌రెడ్డి.