సైనికులు గడ్డకట్టే చలిలో అత్యంత కఠిన పరిస్థితుల మధ్య పహారా కాస్తుంటారు. వారికి ఫిట్నెస్ అత్యంత ముఖ్యం. అందుకే ప్రతిరోజూ మంచుగడ్డల్లోనే వర్కౌట్స్ చేస్తారు. కాగా, జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ చలిలో 18000 అడుగుల ఎత్తులో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్‌కు చెందిన ఓ సైనికుడు సూర్యనమస్కారాలు చేసి, ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
లడఖ్‌లో ఈ వీడియోను చిత్రీకరించారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్‌కి చెందిన సైనికుడు జీరో ఉష్ణోగ్రతలో అర్దనగ్నంగా ‘సూర్య నమస్కారం’ చేశాడు. అత్యంత ఎత్తులో సైనికుడు చేసిన సూర్య నమస్కారాల వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లకు ఫిట్నెస్ లక్ష్యాలను అందిస్తోంది. ఈ వీడియో లక్షకు పైగా వీక్షణలను సొంతం చేసుకున్నది. ఈ వీడియోను ఏడువేలమందికిపైగా లైక్ చేశారు.
#WATCH | An ITBP officer practicing ‘Surya Namaskar’ at 18,000 feet in Ladakh in snow conditions & sub-zero temperatures
(Source: ITBP) pic.twitter.com/URB8CIMHQk
— ANI (@ANI) July 20, 2022