Telugu wikipedia | తెలుగు వికీపీడియాకు అరుదైన ఘనత

-ఉభయ తెలుగు రాష్ట్రాల గ్రామాల వ్యాసాల్లో మ్యాపులను చేర్చి రికార్డు
తెలుగుయూనివర్సిటీ : అంతర్జాలంలో అతిపెద్ద స్వేచ్చా విజ్ఞాన సర్వస్వమైన తెలుగు వికీపీడియా అరుదైన ఘనత సాధించింది. తెలుగు వికీపీడియాలోని 28,605 వ్యాసాలలో ఫోటోలు, మ్యాపులు చేర్పి ప్రపంచ వికీపీడియాల్లో మూడవ స్థానంలో నిలిచి తెలుగువారి సత్తా చాటింది. వికీమీడియా నిర్వహించే అనేక ఫోటోగ్రఫీ పోటీల ద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రపంచంలోని అన్ని భాషల వికీపీడియాల్లో జూలై-ఆగస్టు నెలల్లో వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 పేరుతో ఒక పోటీ నిర్వహించబడింది. అందులో భాగంగా రెండు నెలల పాటు ప్రత్యేకంగా ఒక ఉద్యమం చేపట్టిన తెలుగు వికీ రచయితలు సుమారు 22,700లకు పైగా గ్రామాల వ్యాసాల్లో మ్యాపులను చేర్చి రికార్డు సృష్టించారు.
తెలుగు వికీపీడియాలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 30వేల గ్రామాల గురించిన వ్యాసాలలో, ఆయా గ్రామాలలో ఉన్న విద్య, వైద్య, రవాణా సౌకర్యాలు, దర్శనీయ ప్రదేశాలు తదితరాల గురించి విలువైన సమాచారం లభిస్తుంది. ఇప్పుడు ఈ వ్యాసాలకు మ్యాపు రూపంలో ఒక హంగు చేకూరింది. వికీపీడియా అందించే సమాచారాన్ని ఎవరైనా ఉచితంగా, నిరాక్షేపణీయంగా వాడుకోవచ్చని వికీపీడియా తెలియజేస్తుంది. అంతేగాకుండా వికీపీడియా వ్యాసాల్లో ఎవరైనా మార్పులు చేర్పులు చెయ్యవచ్చు కూడా. అలా స్వచ్చంధంగా ముందుకువచ్చేవారిని వికీపీడియా ఆహ్వానిస్తోంది. కొత్త సమాచారం చేర్చేందుకు ఔత్సాహికులను ప్రోత్సహిస్తోంది.

గ్రామాల వ్యాసాల్లో మ్యాపులు చేర్చే పనిలో కూడా కొత్తగా వికీపీడియా సైటుకు te.wikipedia.orgకు వచ్చి అక్కడ వర్గం ఆంధ్రప్రదేశ్ గ్రామాలు, వర్గం తెలంగాణ గ్రామాలు అని వెతికి ఆయా రాష్ట్రాల్లోని గ్రామాల వ్యాసాలకు వెళ్ళి తమతమ గ్రామాల సమాచారాన్ని చూడవచ్చు. తమ గ్రామానికి చెందిన ఫోటోలను ఈ వ్యాసాల్లో చేర్చవచ్చు.
భారత దేశానికి సంబంధించి 3వేల వ్యాసాలు రాయడమే మా సంకల్పం : తెలుగు వికీపీడియా ప్రతినిధులు.
ఇప్పుడు 75వ స్వతంత్ర భారత ఉత్సవాల సందర్బంగా ఈ సంవత్సరమంతా వికీపీడియాలో ప్రత్యేకకృషి చేస్తున్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామానికి, స్వతంత్ర భారత దేశపు 75ఏళ్ళ ప్రస్థానానికి సంబంధించి కొత్తగా 3వేల వ్యాసాలను రాయాలనే సంకల్పంతో ఈ ప్రత్యేక కృషిని ప్రారంభించాము. ఇందులో కూడా ఎవరైనా స్వచ్చందంగా పాల్గొనవచ్చని సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

