Bolivia | బొలీవియాలో సైనిక తిరుగుబాటు.. ఆర్మీ జనరల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
బొలీవియాలో సైనిక తిరుగుబాటును భగ్నం చేశారు. రాజధాని నగరం లా పాజ్‌లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లోకి సైనికులు బుధవారం దూసుకెళ్లారు. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఆర్మీ జనరల్ జువాన్ జోస్ జునిగాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Bolivia | న్యూఢిల్లీ: బొలీవియాలో సైనిక తిరుగుబాటును భగ్నం చేశారు. రాజధాని నగరం లా పాజ్‌లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లోకి సైనికులు బుధవారం దూసుకెళ్లారు. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఆర్మీ జనరల్ జువాన్ జోస్ జునిగాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రెసిడెంట్ లూయిస్ ఆర్సే ఈ తిరుగుబాటును తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడానికి ప్రయత్నించే శక్తులను బొలీవియా ఎదుర్కొంటున్నదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం కోసం ఏకం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమకు మద్దతివ్వాలని వివిధ దేశాల నేతలను కోరారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి సైనికులు బుధవారం సాయంత్రం తిరుగుముఖం పట్టారు. ప్యాలెస్‌ను పోలీసులు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు.
మరికొన్ని వార్తలు చదవండి..
లైంగిక వేధింపుల కేసులో యెడియూరప్పపై చార్జిషీట్
బెంగళూరు: మైనర్ బాలిక (17)పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నమోదైన కేసులో కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్పపై సీఐడీ గురువారం చార్జిషీటును దాఖలు చేసింది. ఆయన డాలర్స్ కాలనీలోని తన నివాసంలో ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఈ నేరానికి పాల్పడినట్లు మార్చిలో కేసు నమోదైంది. బాలిక తల్లి (54) ఫిర్యాదు ఆధారంగా సదాశివ నగర్ పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను యెడియూరప్ప తోసిపుచ్చారు. ఫిర్యాదు చేసిన మహిళ (54) గత నెలలో ఓ ప్రైవేటు దవాఖానలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ మరణించారు.
పోలీస్ కస్టడీలో నటి పవిత్రా గౌడ మేకప్, లిప్‌స్టిక్
బెంగళూరు: కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన నటి పవిత్రా గౌడ పోలీస్ కస్టడీలో సైతం షూటింగ్‌కు వెళ్తున్న మాదిరిగా లిప్‌స్టిక్ వేసుకుని, పూర్తి మేకప్‌తో ఉన్న దృశ్యాలు వివాదం రేపాయి. విచారణలో భాగంగా పోలీసులు ఈ నెల 15న ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. దీంతో లోపలికి వెళ్లిన ఆమె లిప్‌స్టిక్ వేసుకుని, మేకప్ వేసుకుని నవ్వుతూ పోలీసులతో పాటు బయటకు వస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీంతో ఆమె నిందితురాలా, సినిమాలో హీరోయినా? అంటూ ట్రోలింగ్ ప్రారంభం కావడంతో పోలీస్ శాఖ స్పందించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మహిళా ఎస్ఐను వివరణ ఇవ్వాలంటూ డీసీపీ నోటీసులు జారీ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

