ఎన్ని ఫ్యాషన్ పత్రికలు తిరగేసినా, ఎన్ని యూట్యూబ్ చానల్స్ సబ్‌స్ర్కైబ్ చేసినా..కొత్త సందేహాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఫలానా బ్రాండ్ వస్తువులు కొనాలా వద్దా, ఫలానా కెమికల్స్ ఉన్న ఉత్పత్తులు వాడాలా వద్దా, ఫలానా సినిమా తార నిగారింపు కోసం ఏం చేస్తుంది? .. ఇలాంటి అనేకానేక ప్రశ్నలకు ‘కల్ట్ బ్యూటీ యాప్’ జవాబిస్తుంది. ఇందులో దాదాపు రెండొందల గ్లోబల్ బ్రాండ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటుంది. సౌందర్య పరిజ్ఞానాన్ని బేరీజు వేసుకోవడానికి క్విజ్లు కూడా ఉంటాయి. నిపుణుల సలహాలూ తీసుకోవచ్చు. ఆసక్తి ఉంటే మీరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు.