పండుగ పూట విషాదం రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

ఆదిలాబాద్ : శివరాత్రి పర్వదినం.. ఆ బాలుడి ఇంట్లో విషాదం నింపింది. మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా భోకర్ తాంసి గ్రామానికి చెందిన విఠల్ కుమారుడు విపుల్ (15) ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్ గ్రామంలో మేనమామ ఇంటికి రెండు రోజుల క్రితం వచ్చాడు. శివరాత్రి సందర్భంగా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామంలోని మల్లికార్జునాలయానికి మేనమామ, విపుల్ బైక్ పై బయల్దేరారు. ఇచ్చోడ జాతీయ రహదారి ఆదిలాబాద్ బైపాస్ వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ(టీఎన్52 కే 8488) బైక్‌ను ఢీకొట్టింది. దీంతో విపుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. మేనమామ విలాస్(36) స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ సూర్యప్రకాశ్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

