96 Movie | విజయ్‌సేతుపతి, త్రిష ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం 96. 2018లో వచ్చిన ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. ప్యూర్ లవ్‌స్టోరిగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించాడు.ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. భాషతో సంబంధం లేకుండా అందరూ ఈ చిత్రాన్ని చూసారు. ఇప్పుడు 96 సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రీప్ట్ పనులు పూర్తయ్యాయని త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక ఇందులో రామ్ ,జానుగా అలరించిన విజయ్,త్రిషలే ఈ సీక్వెల్లో నటిస్తారా.? లేదా అనేది చూడాలి. ఈ చిత్రం తెలుగులో జానుగా రిమేక్ అయ్యింది. ఇందులో శర్వానంద్, సమంతలు హీరో హీరోయిన్లుగా నటించగా దిల్‌రాజు నిర్మించాడు.