హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్లో ప్రవేశం కోసం టీజీ ఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ మొదటి విడత సీట్లను మంగళవారం కేటాయించారు.
సీట్లు దక్కించుకున్న వారు ఈ నెల 27లోపు ఫీజు చెల్లించాలని, జూలై 10 నుంచి 13 వరకు కాలేజీ ల్లో రిపోర్ట్ చేయాలని ఈసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు.