50 లక్షల ఉద్యోగాలు, మహిళల రక్షణ : కమల్‌హాసన్ ఎన్నికల హామీలు

చెన్నై : త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరంగేట్రం చేస్తున్న సుప్రసిద్ధ నటుడు కమల్‌హాసన్.. కొద్దిసేపటి క్రితం తన ఎన్నికల హామీలను ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని కట్టబెట్టినపక్షంలో రాష్ట్రంలో 50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని, ప్రతి యూనిఫాం సెక్టార్ (రాష్ట్ర రంగం) లో మహిళలకు 50 శాతం ఉద్యోగాలు కేటాయించనున్నట్లు కమల్‌హాసన్ వెల్లడించారు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే కమల్‌హాసన్ తన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ తరఫున ప్రచారం భాద్యతలను భుజాన వేసుకుని పర్యటనలు ప్రారంభించారు. శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ, బాధలో ఉన్న మహిళల సంరక్షణ, ఒంటరి తల్లులకు మద్దతు, మహిళలందరికీ ఉచిత పునరుత్పత్తి ఆరోగ్య పరీక్ష వంటివి కమల్‌హాసన్ ఇచ్చిన వాగ్దానాల్లో మరికొన్ని.
యువతకు 50 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కాకుండా నిరుద్యోగ భత్యాన్ని సవరించనున్నట్లు ఎంఎన్ఎం చీఫ్ హామీ ఇచ్చారు.
తమిళనాడులో 234 మంది సభ్యుల అసెంబ్లీకి ఎన్నికలు ఏప్రిల్ 6 న ఒకే దశలో జరుగనున్నాయి.
ఈ ఎన్నికల్లో కూటమి కోసం ఎంఎన్ఎం పలు పార్టీలతో చర్చలు జరుపుతున్నది. రాష్ట్ర ఎన్నికలకు తన నాయకత్వంలో మూడో ఫ్రంట్ ఏర్పడే అవకాశం ఉన్నదని కమల్‌హాసన్ ఇటీవల చెప్పారు. అగ్రశ్రేణి నాయకత్వం నుంచి నేరుగా వస్తే డీఎంకేతో పొత్తు ఆహ్వానాన్ని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే డీఎంకే నుంచి ఆహ్వానం వచ్చిందని, చర్చలు జరిగాయని ప్రతిఒక్కరూ చర్చించుకుంటున్నారు.. కానీ ఎవరూ నేరుగా నా దగ్గరకు రాలేదని కమల్‌హాసన్ వెల్లడించారు.
మార్చి 7 న ఎంఎన్ఎం అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించనున్నది.
అధికార ఏఐఏడీఎంకే-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, డీఎంకే-కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కోసం పొత్తులు చేసుకుని ప్రచారాలను ప్రారంభించాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

