250 మిలియన్ల డాలర్ల కోవిడ్ నిధులు స్వాహా.. అమెరికాలో 48 మందిపై ఛార్జిషీట్
covid relief fund scam:అమెరికాలోని మిన్నసొటలో కోవిడ్ నిధులను దుర్వినియోగం చేశారు. ఈ కేసులో 48 మందిపై ఛార్జిషీట్ నమోదు చేశారు. ప్రభుత్వ ఖాజానా నుంచి సుమారు 250 మిలియన్ల డాలర్ల నిధుల్ని అక్రమంగా వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చిన్న పిల్లల పోషకాహారం పథకంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఫెడరల్ అధికారులు గుర్తించారు. మిన్నసొటలో వేలాది మంది పిల్లలకు ఆహారం అందిస్తున్నట్లు కొన్ని నకిలీ కంపెనీలను
మినియపోలిస్: అమెరికాలోని మిన్నసొటలో కోవిడ్ నిధులను దుర్వినియోగం చేశారు. ఈ కేసులో 48 మందిపై ఛార్జిషీట్ నమోదు చేశారు. ప్రభుత్వ ఖాజానా నుంచి సుమారు 250 మిలియన్ల డాలర్ల నిధుల్ని అక్రమంగా వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చిన్న పిల్లల పోషకాహారం పథకంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఫెడరల్ అధికారులు గుర్తించారు. మిన్నసొటలో వేలాది మంది పిల్లలకు ఆహారం అందిస్తున్నట్లు కొన్ని నకిలీ కంపెనీలను సృష్టించారని, ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం నుంచి ఆ మీల్స్ కోసం రియంబర్స్మెంట్ తీసుకున్నారని కోర్టులో ప్రాసిక్యూటర్లు వాదించారు. నిజానికి కొంత మందికి మాత్రమే ఆహారాన్ని సరఫరా చేశారని, అయితే ప్రభుత్వ నిధులతో కొందరు లగ్జరీ కార్లు, ప్రాపర్టీలు, జ్వలరీ కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. సహాయ నిధుల దుర్వినియోగం కేసులో విచారణ జరుగుతున్నట్లు మిన్నసొట అటార్నీ ఆండీ లూగర్ తెలిపారు. ఫీడింగ్ అవర్ ఫ్యూచర్ అనే ఎన్జీవో పిల్లలకు ఫుడ్ సర్వ్ చేసినట్లు రియంబర్స్మెంట్ బిల్లులు పెట్టింది. అయితే ఈ కేసులో ఫీడింగ్ అవర్ ఫ్యూచర్ వ్యవస్థాపకులు ఏమీ బాక్ పేరును ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

