రసాయన కర్మాగారంలో గ్యాస్ లీకేజీ.. 34 మందికి అస్వస్థత
Toxic Gas Leaks | మహారాష్ట్ర అంబర్‌నాథ్‌లో మంగళవారం ఓ రసాయన కర్మాగారంలో గ్యాస్ లీక్ కావడంతో 30 మందికిపైగా ఆసుపత్రి పాలయ్యారు. కర్మాగారం సమీపంలో

ముంబై : మహారాష్ట్ర అంబర్‌నాథ్‌లో మంగళవారం ఓ రసాయన కర్మాగారంలో గ్యాస్ లీక్ కావడంతో 30 మందికిపైగా ఆసుపత్రి పాలయ్యారు. కర్మాగారం సమీపంలో నివసిస్తున్న స్థానికులు ఊపిరి ఆడకపోవడం, కళల్లో మంట, వికారం, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారని థానే మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతీయ విపత్తు నిర్వహణ సెల్ చీఫ్ సంతోష్ కదం తెలిపారు. ఉదయం 10 గంటల సమయంలో అంబర్‌నాథ్‌లోని మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (MIDC)లో ఉన్న ఓ ప్లాంట్ నుంచి సల్ఫ్యూరిక్ యాసిడ్ లీక్ అయినట్లు ఆయన చెప్పారు.
ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర సమస్యలతో 34 మంది ఉల్లాస్‌నగర్‌లోని సెంట్రల్ ఆసుపత్రిలో చేరారినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారని, ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు. ఘటన అనంతరం అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, గ్యాస్ లీక్ కాకుండా చర్యలు చేపట్టారు. లీకేజీకి గల కారణాలు తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నట్లు సంతోష్ కదం వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

