హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 329 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,60,471కు పెరిగింది. తాజాగా 307 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 6,51,085 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24గంటల్లో ఒకరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,889కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.57శాతం, మరణాల రేటు 0.58శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,497 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ ఒకే రోజు 78,4231 టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.